‘ఇండియన్ 3’ పై కొత్త ట్విస్ట్.. నిజమేనా?

‘ఇండియన్ 3’ పై కొత్త ట్విస్ట్.. నిజమేనా?

Published on Jul 16, 2025 11:00 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా నటించిన ఎన్నో ఐకానిక్ హిట్ చిత్రాల్లో “ఇండియన్” కూడా ఒకటి. మావెరిక్ దర్శకుడు శంకర్ తో చేసిన ఈ సినిమాకి ఎంతో మంచి పేరుంది. అయితే దీనికి సీక్వెల్ అనౌన్స్ చేసినప్పుడు కలిగిన హైప్ అది రిలీజ్ అయ్యాక మాత్రం వాటిని అందుకోలేదు.

అయితే దీనికి ముందే మేకర్స్ పార్ట్ 3 ని కూడా లాక్ చేసేసుకున్నారు. కానీ పార్ట్ 2 విఫలం అయ్యేసరికి ఈ పాటికే వచ్చేయాల్సిన ఇండియన్ 3 మాత్రం ఇంకా రాలేదు. మధ్యలో చాలా తతంగమే నడిచింది. సినిమా ఆగిపోయింది అని అలానే డైరెక్ట్ ఓటిటిలోకి వస్తుంది అంటూ పలు కామెంట్స్ వినిపించాయి.

కానీ దర్శకుడు శంకర్ మాత్రం ఇండియన్ 3 ఉందని కన్ఫర్మ్ చేశారు. అయితే లేటెస్ట్ ట్విస్ట్ గా తమిళ సినీ వర్గాలు నుంచి ఇండియన్ 3 డెఫినెట్ గా వస్తుందనే అంటున్నారు. అలాగే ఒక సాంగ్ ఇంకా కొన్ని పోర్షన్స్ షూట్ మిగిలి ఉందని వాటిని తెరకెక్కిస్తారని కొత్త రూమర్లు మొదలయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు