మొత్తం మూడు వరుస భారీ హిట్స్ తర్వాత మహేష్ కాస్త గ్యాప్ తీసుకుని అనౌన్స్ చేసిన చిత్రం “సర్కారు వారి పాట”. మంచి వరుస విజయ చిత్రాల దర్శకుడు పరశురామ్ తో ప్లాన్ చేసిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇపుడు ఈ చిత్రం కు సంబంధించి ఇది ఒక సరికొత్త ప్రశ్న అనుకోవచ్చు. ఎప్పటి నుంచో ఈ సినిమా విషయంలో హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా తెలియరాలేదు.
మరి అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం షూట్ కు కూడా రెడీ అవుతుంది. వచ్చే నవంబర్ నుంచే షూట్ ప్రారంభం అవ్వడమే అనుకుంటే ఈ మొదటి షెడ్యూల్ లోనే 45 శాతంకి పైగా కంప్లీట్ చెయ్యనున్నారని తెలుస్తుంది. కానీ మరోపక్క ఇంకా హీరోయిన్ పేరు కూడా ఇంకా బయటకు రాలేదు. మరి అలాంటిది ఇంత మొత్తం కూడా హీరోయిన్ లేకుండానే జరుగుతుందా అన్న ప్రశ్న మెదులుతుంది.
లేదా ఒకవేళ షూట్ మొదలు అయినా సరే హీరోయిన్ లేకుండానే అంత షూట్ జరుగుతుందా అన్నది మరో ప్రశ్న. మరి షూట్ మొదలయ్యే లోపే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అన్నది ప్రకటిస్తారో లేదో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.