స్టార్స్ తో ‘మన శంకర వరప్రసాద్ గారు’లో హిలేరియస్ ట్రాక్..?

Mana-Shankara-Vara-Prasad-G (1)

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “మన శంకర వర ప్రసాద్ గారు” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. అనీల్ రావిపూడి సినిమాలు అంటేనే సాలిడ్ ఎంటర్టైన్మెంట్. అలానే ఈ సినిమాలో కూడా హిలేరియస్ ట్రీట్ ని రెడీ చేస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఈ చిత్రంపై వినిపిస్తుంది.

దీని ప్రకారం చిరు ఇంకా వెంకీ మామ ఇద్దరిపై సినిమాలో ఓ సాలిడ్ కామెడీ ట్రాక్ ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇద్దరిపై ఓ హిలేరియస్ ఎపిసోడ్ ని దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడని ఇది మంచి హైలైట్ గా సినిమాలో నిలవనుంది అని తెలుస్తుంది. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version