కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు దసరా కానుకగా తన కొత్త సినిమా ‘కామ్రేడ్ కల్యాణ్’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఓ గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్‌లో నక్సలైట్ పాత్రలోశ్రీ విష్ణు నటిస్తున్నాడని.. దీంతో ఈ సినిమా మొత్తం సీరియస్ మోడ్‌లో ఉండబోతుందని అందరూ అనుకుంటున్నారు.
కానీ, ఈ సినిమాలో శ్రీ విష్ణు మార్క్ హిలేరియస్ కామెడీ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి అభిమానిగా కనిపిస్తాడు. నారాయణ మూర్తి సినిమాలు చూసతూ పెరిగిన కుర్రాడు నక్సలైట్‌గా ఎందుకు మారాడు అనేది ఈ సినిమా కథగా ఉండనుంది. ఇక ఈ కథలో కామెడీకి మాత్రం లోటు లేకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్ర కథ 1992లో ఆంధ్రా-ఒడిశా బోర్డర్ ప్రాంతంలో సాగనుంది. ఇక ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయిందని.. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో, టామ్ చాకో విలన్‌గా కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.