‘బాహుబలి 3’ సర్ప్రైజ్ లేదు కానీ..!

ప్రస్తుతం ఎంతో అవైటెడ్ గా ఉన్న పాన్ ఇండియా రీరిలీజ్ చిత్రమే బాహుబలి ది ఎపిక్. రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అండ్ టీమ్ కలయికలో వచ్చిన ఈ సినిమా భారతదేశ సినిమా రూపు రేఖలు మార్చేసింది. ఇలా రెండు సినిమాలు కలిపి వస్తున్న ఈ చిత్రానికి చివరలో పార్ట్ 3 లీడ్ ఇస్తూ సర్ప్రైజ్ ఉంటుంది అని గత కొన్ని రోజులు నుంచి బజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే అలాంటి సర్ప్రైజ్ ఏమి లేదని నిర్మాత శోభు యార్లగడ్డ చెబుతున్నారు. కానీ మరో సర్ప్రైజ్ అయితే ఉండొచ్చు అన్నట్టు హింట్ ఇచ్చారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా సినిమా పనిలోనే బిజీగా ఉన్నారని తెలిపారు. సో పార్ట్ 3 కాదు కానీ మరో సర్ప్రైజ్ ఈ భారీ రీరిలీజ్ లో మనం ఆశించవచ్చు. ఇక ఈ ఎపిక్ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు అలాగే రానా దగ్గుబాటి, అనుష్క, సత్యరాజ్, తమన్నా ఇంకా రమ్యకృష్ణలు సాలిడ్ రోల్స్ లో నటించారు.

Exit mobile version