హీరో శర్వానంద్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘భోగి’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. అయితే, రెండు ప్రధాన షెడ్యూల్స్ పూర్తి చేశాక, కొన్ని కీలక సన్నివేశాల కోసం భారీ సెట్‌ను నిర్మించారు. దీని కోసం మేకర్స్ భారీ ఖర్చు చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయింది.
దీంతో ఈ చిత్ర షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కాగా, ఈ వారం నుంచి ఈ చిత్ర షూటింగ్ మళ్లీ పునఃప్రారంభం కానుంది. శర్వానంద్ ఈ సినిమాకి బల్క్ డేట్లు కేటాయించగా, త్వరలోనే సెట్స్‌లో చేరనున్నాడు.
ఈ చిత్ర షూటింగ్‌ను జనవరి 2026 నాటికి ఎలాగైనా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆషికా రంగనాథ్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు