జీ5లో ప్రసారమయ్యే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమానికి నాగచైతన్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఈ షోలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. అందులో ముఖ్యంగా ‘మహానటి’ సినిమాలో పాత్రను తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు చైతు చెప్పడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇంతకీ, ‘మహానటి’ సినిమా గురించి చైతు ఏం చెప్పాడంటే.. ‘నాగ్ అశ్విన్ నాకు ‘మహానటి’లో తాతయ్య పాత్ర (ఏఎన్‌ఆర్) చేయాలని చెప్పగానే తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను’ అని చైతు చెప్పాడు.
చైతు ఇంకా మాట్లాడుతూ.. ‘తాతయ్య పాత్రలో నటించను అని చెప్పాను. ఎందుకంటే ఆయన లాగా నటించడం మరొకరికి సాధ్యం కాదు. ‘నేను ఏఎన్నార్‌లా చేయడం ఏంటి?. నా వల్ల కాదు. అది అసాధ్యం. మర్చిపోండి’ అని నాగ్ అశ్విన్‌తో చెప్పాను. కానీ, నాగ్ అశ్విన్ మాత్రం వదిలిపెట్టలేదు. అప్పుడు ఆలోచించాను. ఒకవేళ నేను తాత పాత్ర చేయకపోతే వేరే ఎవరో ఆ పాత్రలో నటిస్తాడు. నేనుండగా ఆ పాత్ర మరొకరు చేయడం ఏంటి? అనిపించింది. అందుకే, ఆ పాత్ర చేయాలని నిర్ణయించుకున్నా’ అని నాగచైతన్య తెలిపారు.