బంధువునే డైరెక్ట్ చేయమంటున్న స్టార్ హీరో !

బంధువునే డైరెక్ట్ చేయమంటున్న స్టార్ హీరో !

Published on Apr 16, 2020 7:02 PM IST

తమిళ సినిమా ‘ఖైదీ’ తెలుగులో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. అజయ్ దేవగణ్ సైతం చిత్రాన్ని చూసి వెంటనే డేట్స్ ఇచ్ఛేసిన సంగతి కూడా తెలిసిందే. నిజానికి ఈ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ స్వయంగా దర్శకత్వం వహించాల్సి ఉంది, కానీ ఇప్పుడు అతను బిజీగా ఉన్నందున.. అజేయ్ దేవగణ్ తన బంధువు అయిన ఎడిటర్ ధర్మేంద్ర శర్మను ఈ సినిమాకు డైరెక్టర్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర శర్మ బాలీవుడ్లో ఫేమస్ ఎడిటర్. ఇప్పుడు ఖైదీ చిత్రాన్ని ఆయనే దర్శకత్వంతో పాటు ఎడిట్ కూడా చేయనున్నాడు.

కాగా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి ఈ రీమేక్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. 2021 ఫిబ్రవరి 12న ఈ రీమేక్ విడుదలవుతుందని కూడా అజయ్ దేవగన్ అనౌన్స్ కూడా చేశారు. ఇక కేవలం హీరో మీద, మాస్ ఎంలిమెంట్స్, ఫాధర్, డాటర్ ఎమోషన్ మీదే నడిచిన ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తుందని భావించిన రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

కార్తీ హీరోగా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించింది. మరి అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు