RRR హీరోయిన్ పేరిట 77 లక్షలు చీటింగ్.. డీటెయిల్స్ ఇవే!

RRR హీరోయిన్ పేరిట 77 లక్షలు చీటింగ్.. డీటెయిల్స్ ఇవే!

Published on Jul 9, 2025 1:05 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన ఆలియా భట్ మన తెలుగు ఆడియెన్స్ కి RRR అలాగే జిగ్రా లాంటి సినిమాలతో మరింత దగ్గరైన సంగతి తెలిసిందే. అయితే ఆలియా భట్ విషయంలో ఓ షాకింగ్ న్యూస్ ఇపుడు వైరల్ గా వినిపిస్తుంది. ఆమె పేరిట జరిగిన ఒక ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గతంలో ఆలియాకి పర్శనల్ అసిస్టెంట్ గా పని చేసిన వేదిక ప్రకాష్ శెట్టి ఆమె దగ్గర పని చేయడం మొదలు పెట్టిన కొన్నాళ్లకే చేతి వాటం చూపించడం మొదలు పెట్టిందట. ఆలియా దగ్గర పనిలో చేరాక ఆమె ప్రొడక్షన్ హౌస్ లో కూడా వర్క్ చేసిన వేదిక నకిలీ బిల్లులు వంటివి సృష్టించి ఆలియా సంతకాన్ని కూడా నకిలీ చేసి వాటి ద్వారా సుమారు 77 లక్షలు వరకు కొట్టేసిందట.

దీనితో ఈ మ్యాటర్ ఆలస్యంగా వెలుగులోకి రాగా పోలీసులు ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేశారు. ఇక విచారణలో మరిన్ని విషయాలు బయటకి వస్తున్నాయట. ఇక ఇవి పక్కన పెడితే ప్రస్తుతం ఆలియా ‘ఆల్ఫా’ సినిమాలో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు