టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన అవైటెడ్ హిస్టారికల్ చిత్రమే “హరిహర వీరమల్లు”. ఎన్నో ఏళ్ళు నిరీక్షణ తర్వాత ఎట్టకేలకి ఈ జూలైలో సినిమా విడుదల కాబోతుంది. మరి ఈ గ్యాప్ లో ప్రమోషన్స్ ఇతర పాటలు కూడా రావాల్సి ఉండగా సినిమా రన్ టైం పై కూడా పలు వార్తలు బయటకి వచ్చాయి.
అయితే మొదట హరిహర వీరమల్లుని మేకర్స్ 2 గంటల 40 నిమిషాలకి కట్ చేసినట్టుగా వినిపించింది. కానీ లేటెస్ట్ సమాచారం ఏంటంటే మొత్తంగా 2 గంటల 42 నిమిషాల నిడివి గల సినిమా థియేటర్స్ లో పడనుందట. ఇక సెన్సార్ కి కూడా సినిమా పంపాల్సి ఉండగా అక్కడ మరింత క్లారిటీ సినిమాపై రానుంది. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ జూలై 24న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.