స్పెషల్ డేట్లో స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్న 3G లవ్ టీం

స్పెషల్ డేట్లో స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్న 3G లవ్ టీం

Published on Nov 20, 2012 1:18 AM IST


పదిహేను మంది కథానాయకులతో పన్నెండు మంది కథానాయికలతో తెరకెక్కుతున్న చిత్రం “3G లవ్” ఫిబ్రవరి14 విడుదల అనే శీర్షికతో రానున్న ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చెయ్యనున్నారు. యువత మనోభావాలకు దగ్గరగా ఉండే కథను ఎంచుకున్నట్టు దర్శకుడు గోవర్ధన్ కృష్ణ తెలిపారు. శేఖర్ చంద్ర అందించిన సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుందని డిసెంబర్ 12న (12-12-12) మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల12 సెకండ్లకు ఈ చిత్రంలో ఒక పాటను వీడియోతో పాటు విడుదల చెయ్యనున్నారు. “సెర్చ్ ఫర్ లవ్” అంటూ సాగే ఈ పాట ఆవిష్కరణలో పాల్గొనాలని అనుకుంటే మీ పేరు,ప్రదేశం మరియు మొబైల్ నెంబర్ ని 3Glove.in @gmail .com కి పంపవచ్చు. ఈ కార్యక్రమం ప్రసాద్ లాబ్స్ లో జరగనుంది. ప్రతాప్ కోలగట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు