మహేష్ బాబు పాట కోసం 2000 మంది మోడల్స్


సుకుమార్ డైరెక్షన్లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమై విషయం తెలిసిందే. అక్కడే ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో ఒక పాట చిత్రీకరిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ పాట గురించిన కొంత ఆసక్తికరమైన సమాచారం మాకు లభించింది. ఈ పాటలో మహేష్ బాబుతో పాటుగా 2000 మంది మోడల్స్ పాల్గొంటున్నారు. ఈ రోజు 600 మంది మోడల్స్ పై చిత్రీకరణ చేసారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఈ పాట చాలా బావుందని సమాచారం. గతంలో మహేష్ బాబుతో దూకుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కూడా వారె నిర్మిస్తున్డటం గమనార్హం. మహేష్ బాబు సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

Exit mobile version