దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ‘కూలీ’ చిత్రంతో సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంటూ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతోంది. భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయిన ప్రతి చోట కూలీ రీసౌండ్ చేస్తుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కూలీ చేస్తున్న యుద్ధం మామూలుగా లేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1 మిలియన్‌కు పైగా బుక్ మై షో టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇలా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ ఫీవర్‌తో ఈ వీకెండ్ థియేటర్లు మోతమోగిపోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.