పవన్ కళ్యాణ్ కి 1998 సో స్పెషల్ ఇయర్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ని హీరోగా నిలబెట్టిన రెండు బ్లాక్ బస్టర్స్ ఆ ఏడాది ఆయన నుండి వచ్చాయి. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ ఆ తదుపరి ఏడాది గోకులంలో సీత మూవీలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఓ మోస్తరు విజయాలు అందుకున్నాయి. పవన్ కి హీరోగా ఓ ఇమేజ్ ఐతే రాలేదు. దీనితో ఆయన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ తమిళ్ రీమేక్ కి కమిట్ అయ్యారు.
తమిళంలో వచ్చిన లవ్ టు డే చిత్రాన్ని తెలుగులో సుస్వాగతంగా తెరకెక్కించారు. 1998 జనవరి 1న విడుదలైన సుస్వాగతం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ చిత్రం విజయం పవన్ కి హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా ఓపెనింగ్ కి బాలకృష్ణ అతిథిగా రావడం విశేషం. ఇక అదే ఏడాది దర్శకుడు కరుణాకర్ తెరకెక్కించిన తొలిప్రేమ మూవీ ఓ ప్రభంజనం. ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆ సెన్సిబుల్ లవ్ ఎంటర్టైనర్ పవన్ కి యూత్ లో భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఆరువాత పవన్ తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకొని పవర్ స్టార్ అయ్యారు.