టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘బాహుబలి’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ హీరో రానా అన్నదమ్ములుగా కనిపిస్తున్న ఈ మూవీలో అందాల భామలు అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. గత నెల రోజులుగా ఓ భారీ వార్ ఎపిసోడ్ ని అక్కడ షూట్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి షూటింగ్ ప్రారంభించి నేటితో 100 రోజులయ్యింది.
‘రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ రోజు 100వ రోజు షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ మరియు కొన్ని వందల మంది కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నారు. షూటింగ్ నిరంతర వాహినిలా సాగుతోందని’ ఈ చిత్ర టీం తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లు ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.