రేడియో మిర్చిలో 1000 అబద్ధాలు టీజర్ లాంచ్

రేడియో మిర్చిలో 1000 అబద్ధాలు టీజర్ లాంచ్

Published on May 27, 2013 11:00 AM IST

1000abaddalu
సాయిరాం శంకర్, ఎస్తర్ నటీనటిలుగా శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిత్రం మూవీస్ సమర్పణలో సునీత నిర్మిస్తూ, తేజ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘1000 అబద్ధాలు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వున్న ఈ సినిమా టీజర్ ను 98.3 రేడియో మిర్చిలో విడుదల చేసారు. చాలా కాలం తరువాత రమణ గోగుల తన బాణీల ద్వారా మన ముందుకు రానున్నాడు. సంగీతమే కాక ఇతను ఇందులో ఒక పాటకుడా రాయడం విశేషం. హీరో సాయిరాం శంకర్ ఇదివరకే ‘బద్రి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడంతో రమణ గోగులతో మంచి పరిచయమే వుంది. ఈ సినిమాకు రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

తాజా వార్తలు