అత్తారింటికి దారేది 100 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది – బివిఎస్ఎన్ ప్రసాద్

అత్తారింటికి దారేది 100 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది – బివిఎస్ఎన్ ప్రసాద్

Published on Oct 22, 2013 8:54 AM IST

attarintiki-daredi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకి ముందే పైరసీకి గురైనప్పటికీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తోంది. ఈ సినిమా విడుదలై 25 పూర్తి చేసుకోవడంతో ఈ చిత్ర హీరోయిన్ సమంత, నిర్మాత బివిఎస్ఎస్ ప్రసాద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఈ ప్రెస్ మీట్లో బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ‘ విడుదలకి ముందే మేము ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఎంతో అండగా నిలిచారు. పైరసీకి గురైనా వసూళ్లు మాత్రం రికార్డ్ స్థాయిలో రావడం ఆనందంగా ఉంది. సినిమా 100 కోట్లు సాధిస్తుందా? అని చాలా మంది అడుగుతున్నారు. ఆ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని’ అన్నారు

సమంత మాట్లాడుతూ ‘ పైరసీ భారిన పడి కూడా ఇంతపెద్ద విజయం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే 50 రోజుల్లో కలెక్ట్ చెయ్యాల్సిన వసూళ్లను 25 రోజుల్లోనే కలెక్ట్ చేయడం చాలా గ్రేట్. థాంక్స్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంశించారు. అదే ఒక పెద్ద అవార్డు గా భావిస్తున్నానని’ తెలిపింది.

తాజా వార్తలు