సెన్సార్ ఆఫీసర్ పై కేస్ వేయనున్న ఆర్.జి.వి

సెన్సార్ ఆఫీసర్ పై కేస్ వేయనున్న ఆర్.జి.వి

Published on Nov 10, 2013 2:30 AM IST

rgv
తనని అడ్డుకున్నవారిపై లేకపోతే తనకి చిరాకు తెప్పించిన వారిపై అంతకు అంత పగను ఏదో ఒక రూపంలో తీర్చుకోవడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటాడు. ఇప్పుడు మన రమూ ప్రాంతీయ సెన్సార్ ఆఫీసర్ మీద ప్రతీకారం తీర్చుకొనున్నాడు.

సెన్సార్ బోర్డుకు చెందిన ధనలక్ష్మి గారిపై రామూ ఈ సోమవారం నాంపల్లి కోర్టులో కేస్ వేయనున్నాడు. ఈ సినిమాను విడుదల చేయడానికి ఆమె చాలా తనను చాలా ఇబ్బందులు పెట్టిందని, నిజానికి నరకయాతన చూపించిందని రామూ తెలిపాడు, దాని వలన తనకు ఆదాయపరంగా నష్టం కలిగిందని చెప్పుకొచ్చాడు. అంతేకాక ఇంకో అడుగు ముందుకేసి తనని అసభ్యపదజాలంతో దూషించిందని తెలిపాడు. మోహన్ బాబు, విష్ణు వంటి నటులు కూడా గతంలో ధనలక్ష్మి వైఖరిని దూషించడం గమనార్హం

‘సత్య 2’ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎక్సిబిటర్లు ఈ సినిమా విడుదలకు జరిగిన జాప్యం వలన చాలా నష్టాన్ని చవిచూశారు

తాజా వార్తలు