మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మాస్ రికార్డులు క్రియేట్ చేసేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ మూవీని కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.
ఈ సినిమా షూటింగ్‌ను జూన్ నెలలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్గా ఇప్పటికే కేతిక శర్మను సెలెక్ట్ చేశారు మేకర్స్. కాగా, ఇప్పుడు ఈ సినిమాలో మరో బ్యూటీ కూడా నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రెండో హీరోయిన్గా ఆషికా రంగనాథ్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
‘నా సామిరంగ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు మాస్ రాజా రవితేజతో రొమాన్స్‌కు రెడీ అయిన ఈ బ్యూటీ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.