రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “ఎందుకంటే ప్రేమంట”, రాం మరియు తమన్నాలు ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం పరిశ్రమలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది . ఈ మధ్యనే విడుదలయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్ర ఓవర్ సీస్ హక్కులు కోసం ఎనిమిది మంచి పోటి పడుతున్నారు. ఎవరు సొంతం చేసుకోబోతున్నారు అనేది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. దర్శకుడు కరుణాకరన్ ఈ చిత్రాన్ని ప్రత్యేక శ్రద్ద తీసుకొని మరి చేసారు. తనదయిన శైలిలో హాస్యం మరియు ఫ్యామిలీ సెంటిమెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ చిత్రానికి సంగీతం జి.వి.ప్రకాశ్ అందించారు. ఈ నెల 21 ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది. స్రవంతి రవి కిషోర్ ఈ చితాన్ని నిర్మించారు. ఈ చిత్రం మే లో విడుదల అవుతుంది..