బాక్స్ ఆఫీసు వద్ద తన స్టామిన చూపిస్తున్న బాలకృష్ణ

బాక్స్ ఆఫీసు వద్ద తన స్టామిన చూపిస్తున్న బాలకృష్ణ

Published on Apr 1, 2014 8:38 AM IST

Legend2

ప్రస్తుతం ఒక సీనియర్ యాక్టర్ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటుడిగా రిటైర్ అయిన తర్వాత ఆ జనరేషన్ హీరోస్ అయిన బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మాత్రం నటిస్తూనే ఉన్నారు కానీ బాక్స్ ఆఫీసు వద్ద అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోతున్నారు.

గత కొంత కాలం నుంచి ట్రేడ్ అనలిస్ట్ లు కూడా యంగ్ హీరోస్ అయిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలు 40 కోట్ల మార్క్ క్రాస్ చేస్తుంటే ఈ సీనియర్ హీరోలు మాత్రం 25 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

కానీ నందమూరి బాలకృష్ణకి మాత్రం మాస్ లో ఇంకా ఫాలోయింగ్ తగ్గలేదు. ఇటీవలే విడుదలైన లెజెండ్ సినిమాతో బాలకృష్ణ బాక్స్ ఆఫీసు వద్ద మరోసారి తన స్టామినాని నిరూపించుకున్నాడు. అలాగే ఈ సినిమాతో బాలకృష్ణ యంగ్ స్టార్స్ కి గట్టి పోటీ ఇచ్చే రీతిలో కలెక్షన్స్ వసూలు చేస్తున్నారు.

ఉదాహరణకి కృష్ణా జిల్లాని తీసుకుంటే ఈ సినిమా ఫుల్ రన్ లో 2.5 కోట్ల గ్రాస్ టచ్ చేసే అవకాశం ఉంది. ఇదే రేంజ్ని ఇప్పటివరకూ యంగ్ హీరోస్ మాత్రమే అనడుకున్నారు. వెంకటేష్, నాగార్జున లాంటి హీరోస్ ఈ మార్క్ దగ్గరికి కూడా రాలేకపోతున్నారు.

లెజెండ్ ప్రస్తుతం విడుదలైన అన్ని ఏరియాల్లోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. అలాగే బాలకృష్ణ ‘సింహా’ రికార్డ్స్ ని బద్దలు కొడుతోంది.

తాజా వార్తలు