శ్రీనివాస్ అవసరాల దర్శకత్వానికి టైటిల్ సిద్ధం

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వానికి టైటిల్ సిద్ధం

Published on Apr 1, 2014 1:34 AM IST

Srinivas-Avasarala
గతకొన్నాళ్ళుగా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్న శ్రీనివాస్ అవసరాల ఎట్టకేలకు మెగా ఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారనున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుదలకానుంది. వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నాడు.

ఈ సినిమాకు ‘ఉహలు గుసగుసలాడె’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. నాగ సౌర్య ప్రధాన పాత్రధారి. రాశి ఖన్నా ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయం కానుంది. ఈ భామ గతంలో మద్రాస్ కేఫ్ హిందీ సినిమాలో జాన్ అబ్రహం భార్యగా నటించింది. ఆ సినిమా విడుదలైన వెంటనే ఈ చిత్రంలో పాత్రకు ఎంపిక చేసుకున్నారు. హైదరాబాద్ యువకుడికి, ఢిల్లీ యువతికి మధ్య జరిగే ఒక అందమైన ప్రేమకధను తెరకెక్కించనున్నారని సమాచారం .

తాజా వార్తలు