రాజమౌళిని తెగ పొగిడేసిన మిల్క్ బ్యూటీ

రాజమౌళిని తెగ పొగిడేసిన మిల్క్ బ్యూటీ

Published on Mar 30, 2014 2:00 AM IST

rajamouli-tamanna

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో మిల్క్ బ్యూటీ తమన్నా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ భామ ఇప్పటికే దాదాపు సౌత్ లోని అందరు టాప్ హీరోలతో సినిమాలు చేసింది, అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా పనిచేసింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘ఆగడు’ సినిమాలోనే కాకుండా ఎస్ఎస్ రాజమౌళి – ప్రభాస్ తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’లో కూడా నటించనుంది.

ఇంకా సెట్లోకే అడుగుపెట్టని తమన్నా అప్పుడే రాజమౌళిని తెగ పొగిడేస్తోంది. ‘ఎస్ఎస్ రాజమౌళి గారు తన నటీనటుల నుంచి ఎప్పుడూ ది బెస్ట్ రాబట్టుకుంటారు. ఆయనలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఆయన నటుల పాపులారిటీని బట్టి సినిమాలో పెట్టుకోరు ఆ పాత్రకి వాళ్ళు సరిపోతారు అనుకుంటేనే పెడతారు. ఈ సినిమాకి నేను సరిపోతానని నన్ను ఎంచుకున్నప్పుడు నేను థ్రిల్ అయ్యానని’ తమన్నా చెప్పింది.

తమన్నా సమ్మర్ తర్వాత ‘బాహుబలి’ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మహేష్ బాబు ‘ఆగడు’ సినిమా షూటింగ్ లోబిజీగా ఉంది.

తాజా వార్తలు