‘అరుంధతి’ సినిమాతో క్రేజ్ మరియు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని టాప్ హీరోయిన్ గా మారిన యోగ బ్యూటీ అనుష్క ‘వేదం’, ‘మిర్చి’ లాంటి సినిమాల్లో కూడా నటించి ఎలాంటి పాత్రనైనా చేయగలను అని నిరూపించుకుంది. ప్రస్తుతం అనుష్క టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల్లో నటిస్తోంది.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క రుద్రమదేవి గురించి మాట్లాడుతూ ‘మేము ‘రుద్రమదేవి’ కోసం చేసిన హార్డ్ వర్క్ మాటల్లో చెప్పలేనిది. ఈ సినిమా కోసం కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. రుద్రమదేవి పాత్ర కోసం నేను కాస్ట్యూమ్ వేసుకొని అద్దంలో చూసుకున్నప్పుడు రుద్రమదేవి పాత్ర నేను చేస్తున్నానా అని ఎంతో గర్వపడ్డాను. ఈ సినిమాతో మన చరిత్ర గురించి కూడా చాలా తెలుసుకున్నాను. గుణశేఖర్ ప్రతి విషయం గురించి చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిపోతుందని’ చెప్పింది.
ఇటీవలే అనుష్క రజినీకాంత్ సినిమాలో హీరోయిన్ గా నటించనుందని అన్నారు. కానీ ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. రుద్రమదేవి ఈ సంవత్సరంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటే బాహుబలి మాత్రం 2015లో రిలీజ్ కానుంది.