మహేష్ బాబు తదుపరి చిత్రం మురుగదాస్ తో ?

మహేష్ బాబు తదుపరి చిత్రం మురుగదాస్ తో ?

Published on Mar 29, 2014 7:25 PM IST

Mahesh-Babu
ఈ సంవత్సర కాలం మొత్తం, వరుస సినిమాలతో మహేష్ బాబు షెడ్యుల్ బిజీగా ఉన్నప్పటికీ ప్రోడ్యుసర్లు మాత్రం మహేష్ బాబు డేట్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా తరువాత, మహేష్ కొరటాల శివ సినిమాకు షూటింగ్ మొధలుపెట్టనున్నడు.

తాజా సమాచారం చుసుకుంట్టే, తమిళ దర్శకుడు మురుగదాస్ మహేష్ బాబుతో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారని, ఈ విషయమై వీరిద్దరి మధ్య చర్చలు ఇంకా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేల మొదటి వారంలో ‘రాజా రాణి’ సినిమా ప్రచారంలో బాగంగా మురుగదాస్మాట్లాడుతూ, తను మహేష్ బాబుకి పెద్ద అభిమానిని అని, తనతో పని చేయడానికి ఇష్ట పడుతున్నాని అన్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితి కొరటాల శివ అనంతరం మహేష్ బాబు మురుగదాస్ సినిమాకి పని చేస్తారు. ప్రస్తుతం మురుగదాస్, విజయ్ సమంత నటిస్తున్న ‘కత్తి’ అనే తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటె, ప్రముఖ వార్తాపత్రిక లో వచ్చిన వార్తలు చూసుకుంటే, మణిరత్నం సినిమాని మహేష్ బాబు డేట్స్ లేని కారణంగా ఒప్పుకోలేదని తెలుస్తోంది. కానీ దిని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తాజా వార్తలు