పర్యావరణం పై అవగాహన పెంచే కార్యక్రమంలో హీరో రామ్ చరణ్ భాగస్వామి కానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 29 న నిర్వహిస్తున్న ‘ ఎర్త్ అవర్’ కార్యక్రమానికి రామ్ చరణ్ ఈ సంవత్సరం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
‘ఎర్త్ అవర్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం లో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో చరణ్ పాల్గొననున్నారు. ‘పెడల్ ఫర్ ది ప్లానెట్’ పేరుతొ పర్యావరణం పై అవగాహన పెంచే విధంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొననున్న చరణ్ తో పాటు వందలాది గా ప్రజలు అతనితో చేతులు కలుపుతారని నిర్వాహకులు భావిస్తున్నారు. రాత్రి 8.30 నుంచి ఒక గంటపాటు అన్ని విధ్యుత్ పరికరాలను ఆఫ్ చేయమని నిర్వాహకులు ప్రజలను కోరారు.
కాగా రామ్ చరణ్ హీరో గా తెరకెక్కుతున్న ‘గోవిందుడు అందరి వాడేలే’ తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ రెండవ వారం నుంచి హైదరాబాద్ లో మొదలవనుంది. రామ్ చరణ్ సరసన కాజోల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.