మర్డర్ కేస్ లో ఇరుక్కున్న టాలీవుడ్ జూనియర్ నటుడు

మర్డర్ కేస్ లో ఇరుక్కున్న టాలీవుడ్ జూనియర్ నటుడు

Published on Mar 25, 2014 12:30 AM IST

Tollywood-jr-actor-arrested

విలన్ పాత్రలు పోషిస్తున్న ఒక జూనియర్ నటుడు ఈరోజు మర్డర్ కేస్ లో అరెస్ట్ అయ్యాడు. రెహమాన్ అలియాస్ బాబాగా పిలవబడే ఇతను చాలా సినిమాలలో అసిస్టెంట్ విలన్ పాత్రలు పోషించాడు. బాలకృష్ణ సింహా, రవితేజ విక్రమార్కుడు వంటి సినిమాలు కూడా అందులో వున్నాయి

బాబా ఒక వారం క్రితం మసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఒక అతన్ని తన ఇల్లు ఖాళీ చేయమన్నందుకు బెదిరించినట్లు సమాచారం. అప్పటినుండి అతను అదృశ్యమయ్యాడని అందుకే ఇతనిపై కేస్ పెట్టినట్టు పోలీస్ లు తెలిపారు

ఈ క్రిమినల్ కేస్ లో బాబా హస్తం వుండడంతో ఇండస్ట్రీకి చెందినవారు షాక్ కి గురయ్యారు

తాజా వార్తలు