ప్రకాష్ రాజ్ డైరెక్షన్ లో నాని?

ప్రకాష్ రాజ్ డైరెక్షన్ లో నాని?

Published on Mar 24, 2014 1:07 PM IST

nani-prakash-raj
టాలీవుడ్ యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. నాని నటించిన ‘పైసా’, ‘ఆహా కళ్యాణం’ సినిమాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ సినిమాల్లో నాని పెర్ఫార్మన్స్ కి మంచి గుర్తింపు వచ్చినా సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇవి కాకుండా జెండాపై కపిరాజు సినిమా విడుదలకి సిద్దమవుతోంది.

ఇప్పటి వరకూ కొత్త సినిమాలకు సైన్ చేయని నాని తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకి ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించడమే కాకుండా తన సొంత బ్యానర్లోనే నిర్మించనున్నాడు. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం.

నాని ప్రస్తుతం ఈ సినిమా కాకుండా తమిళం నుంచి రైట్స్ కొనుక్కున్న ‘పన్నాయిరుం పద్మినియుం’ సినిమా తెలుగు స్క్రిప్ట్ పనులు కూడా చూసుకుంటున్నాడు. కానీ ఈ సినిమాలో తనే హీరోగా నటిస్తాడా? లేక వేరే ఎవరైనా నటిస్తారా? అనేది ఇంకా ఖరారు కాలేదు.

తాజా వార్తలు