తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా కనిపించనున్న విషయం మనకు తెలిసిందే.. రెండు పార్ట్ లుగా రానున్న ఈ సినిమాలో ఒక పార్ట్ లో అనుష్క హీరోయిన్ అయితే మరో పార్ట్ లో తమన్నా హీరోయిన్. కానీ తమన్నా ఇప్పటి వరకూ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు.
ఈ సంవత్సరం రెండవ అర్ధభాగంలో జరిగే షూటింగ్ లో తమన్నా పాల్గొంటుంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ మూవీలో నటించడానికి తమన్నా తనవంతు ప్రిపరేషన్స్ లో ఉందని అంటున్నారు. అనుష్క లాగానే తమన్నా కూడా రాయల్ ఫ్యామిలీకి చెందిన యువతిలా కనిపించనుంది. కావున తను కూడా కాస్త ఫిజికల్ ట్రైనింగ్, హార్స్ రైడింగ్ లాంటివి నేర్చుకుంటోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ ప్రత్యేక సెట్లో జరుగుతోంది. ప్రభాస్, రానా అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్టర్. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2015 లో రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.