ఊపందుకుంటున్న లెజెండ్ పబ్లిసిటీ

ఊపందుకుంటున్న లెజెండ్ పబ్లిసిటీ

Published on Mar 23, 2014 1:01 PM IST

Legend
ప్రస్తుతం నందమూరి అభిమానులు, తెలుగు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘లెజెండ్’. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా మొదలైన రోజు నుంచి రోజురోజుకి అంచనాలు పెంచేసింది. అలాగే ఇటీవలే విడుదలైన లెజెండ్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 28న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ చిత్ర టీం ప్రమోషన్స్, పబ్లిసిటీని స్పీడ్ చేస్తున్నారు.

నిన్ననే ఈ సినిమాకి చెందిన ‘తంజావూరు బొమ్మ’ ప్రోమో వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు. అలాగే సినిమాకి చెందిన మరో ట్రైలర్ ని ఈ రోజు లాంచ్ చేయనున్నారు. ఈ చిత్ర టీం ప్రమోషన్స్ విషయంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ అందరినీ టార్గెట్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడు వార్తల్లో ఉండేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. రేపు లెజెండ్ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది.

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. జగపతి బాబు విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ మాస్ ఎంటర్టైనర్ ని నిర్మించారు.

తాజా వార్తలు