ప్రతిఘటన సినిమా కోసం టెన్షన్ పడుతున్న ఛార్మీ

ప్రతిఘటన సినిమా కోసం టెన్షన్ పడుతున్న ఛార్మీ

Published on Mar 22, 2014 7:05 PM IST

prathigatana

ప్రతిఘటన సినిమా లో నటించిన ఛార్మీ చాలా టెన్షన్ పడుతుంది. అన్యాయంగా అత్యాచారానికి గురైన ఒక అమ్మాయికి న్యాయం చేసే పోరాటంలో ఈ సినిమాలో ఆమె జర్నలిస్ట్ పాత్ర పోషించిన విషయం తెలిసినదే. ఈ చిత్రం ఆమెకు 50వ సినిమా. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకుడు.

ఈ సినిమా గురించి మాట్లాడుతూ “నిజానికి నేను చేసిన ప్రాజెక్ట్ ల గురించి పెద్దగా పట్టించుకోను. కానీ ఈ ప్రతిఘటన సినిమా వేరు. ఈ సినిమా మీకు నచ్చుతుందా లేదా అని చాలా టెన్షన్ పడుతున్నాను. చాలా సున్నితమైన కధాంశంతో తెరకెక్కించాం. ఈ సినిమాలో నటించడం నా అదృష్టం” అని తెలిపింది. రేష్మ ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి.

ఎం.ఎం కీరవాణి సంగీతదర్శకుడు. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదలకానుంది.

తాజా వార్తలు