ఆది, సన్వి నటిస్తున్న ప్యార్ మైన్ పడిపోయానే సినిమా త్వరలో విడుదలకానుంది. రెండు పాటల మినహా మొత్తం షూటింగ్ పుర్తయింది. ఈ సినిమాకు రవి చావలి దర్శకుడు. రాధామోహన్ నిర్మాత.
లవ్లీ సినిమా తరువాత నానుంచి వస్తున్న పూర్తిస్థాయి ప్రేమకధా చిత్రమని, రాధామోహన్ వంటి నిర్మాతలు మనకు చాలా అవసరమని, దర్శకుడు నా పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దారని ఆది తెలిపాడు
అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రాఫర్. .ఈ సినిమా కాకుండా ఆది ‘గాలిపటం’ సినిమా చేస్తున్నాడు. నవీన్ దర్శకుడు. సంపత్ నంది నిర్మాత. ఆది సరసన ఎరికా ఫెర్నాండెజ్ నటిస్తుంది. అంతేకాక ఆదిని త్వరలో రాకుల్ ప్రీత్ తో జంటగా ‘రఫ్’ సినిమాలో మనం చూడచ్చు