తెలుగు, హిందీ రంగాలలో భారీ ఆఫర్లతో బిజీబిజీగా సాగుతున్న తమన్నా తమిళంలో వీరమ్ సినిమా ఘనవిజయం సాధించడంతో అక్కడ కుడా తనకు డిమాండ్ ను ఏర్పరుచుకుంది
సమాచారం ప్రకారం ‘బాస్ ఎంగిర బాస్కరన్’ సినిమాకు సీక్వెల్ లో తమన్నా హీరోయిన్ సంప్రదించారట. ఈ సినిమా ముందు వెర్షన్ లో ఆర్య, నయనతార, సంతానం ముఖ్య పాత్రధారులు. ఈ సీక్వెల్ లో వీరి పాత్రలు అలానే కొనసాగుతాయి. ఐతే తమన్నా ఈ సినిమాను అంగీకరించినట్టు ఇంకా ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. ఈ రెండు భాగాలకు ఎం.రాజేష్ దర్శకుడు
తమన్నా నటించిన వీరమ్ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ వీరుడోక్కడే ఇక్కడ 21న విడుదలకానుంది. ఈ సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంది. ఈరోజు ఈ చిత్ర తెలుగు ఆడియో హైదరాబాద్ లో విడుదలైంది. దేవిశ్రీ సంగీతదర్శకుడు. శౌర్యం శివ దర్శకుడు