టి.వి లో మెరవనున్న నాగబాబు వారసురాలు

టి.వి లో మెరవనున్న నాగబాబు వారసురాలు

Published on Mar 19, 2014 10:34 PM IST

naga-babu-niharika
జబర్దస్త్ వంటి ప్రముఖ టి.వి షోలో జడ్జిగా నాగబాబు సుపరిచితుడే. ఆయన కొడుకు వరుణ్ తేజ్ ప్రస్తుతం తన మొదటి సినిమాతో బిజీగా వున్నాడు. ఇప్పుడు ఆయన కూతురు కుడా రంగులేసుకోవడానికి ఇష్టపడుతుంది

నాగబాబు కూతురైన కొణిదెల నిహారికా పేరు షార్ట్ ఫిల్మ్స్ జోనర్ లో సుపరిచితమే. ఇప్పుడు ఈ భామ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ‘ఢీ జూనియర్’ కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరించనుంది. ఈ ఎపిసోడ్ 19మార్చ్ రాత్రి 9.కు ప్రసారం కానుంది

మొదటి సారిగా ఈ ఢీ సిరీస్ లో పిల్లలతో నృత్యం చేయించనున్నారు. ఈ ఢీ సిరీస్ ఆంధ్రాలోనే విజయం సాధించిన డ్యాన్స్ సిరీస్ గా పెరుతెచ్చుకోవడం విశేషం. ఆల్ ది బెస్ట్ నిహారిక

తాజా వార్తలు