‘లడ్డు బాబు’ మేకప్ కు నాలుగు గంటలు

‘లడ్డు బాబు’ మేకప్ కు నాలుగు గంటలు

Published on Mar 18, 2014 12:04 PM IST

allari-naresh-laddu-babu
తాజా చిత్రం ‘లడ్డు బాబు’ కోసం తన లుక్ ని పూర్తిగా మార్చుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్. సాధారణంగా సన్నగా పొడువుగా ఉండే నరేష్ ఈ సినిమా లో బొద్దుగా ఉండే యువకుడిలా నటిస్తున్నాడు. తనకు ఈ ‘లడ్డు బాబు’ లుక్ తిసుకురడానికి ప్రోస్తేటిక్ మేకప్ ని వాడుతున్నారు.

ఈ మేకప్ కోసం రోజు నాలుగు గంటల సమయం పడుతుంది. చాలా కష్టమైనా ఈ మేకప్ సమయంలో, నరేష్ ఒక చిరునవ్వుతో ఎలాంటి ఇభంది లేకుండా కుర్చుంటున్నాడని చిత్ర సిబ్బంది అంటున్నారు.

తన అంకిత భావానికి చిత్ర సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. రవిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ ‘లడ్డు బాబు’ వేసవి కనుకగా రాబోతున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ప్రేక్షకులని ఎలా అలరించాబోతున్నడో వేచి చూడాలి.

తాజా వార్తలు