కేరళలో వెంకటేష్ దృశ్యం

కేరళలో వెంకటేష్ దృశ్యం

Published on Mar 16, 2014 10:29 PM IST

Venkatesh
వెంకటేష్, మీనా జంటగా నటిస్తున్న ‘దృశ్యం’ సినిమా కేరళలో షూటింగ్ జరుపుకుంటుంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమాకు ఇది తెలుగు రిమేక్. ఈ సినిమాకు శ్రీ ప్రియ దర్శకురాలు. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్, వైడ్ యాంగిల్ బ్యానర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి

ఈ సినిమా ఫిబ్రవరి లో ప్రారంభమై ఈ నెలలో షూటింగ్ జరుపుకుంటుంది. కేరళలో ఇడుక్కి జిల్లాలో కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విధానంపై దర్శకురాలు చాలా ఆనందంగా వున్నారు. ట్విస్ట్ తో కూడిన ఈ ఫ్యామిలీ డ్రామాలో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు చాలా ఉంటాయని సమాచారం

చాలా భాగం చిత్రీకరణ కేరళలో జరుపుకుంటున్న ఈ సినిమాలో నదియ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాక ఈ సినిమా తమిళ, కన్నడ భాషలలో కూడా రిమేక్అవుతూ వుండడం విశేషం

తాజా వార్తలు