డిసెంబర్ లోగా షూటింగ్ పూర్తి చేసుకోనున్న ‘మనం’

డిసెంబర్ లోగా షూటింగ్ పూర్తి చేసుకోనున్న ‘మనం’

Published on Oct 18, 2013 12:00 PM IST

Manam
అక్కినేని కుటుంబం నటిస్తున్న మల్టీ స్టారార్ సినిమా ‘మనం’. ప్రస్తుతం ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఈ డిసెంబర్ వరకు పూర్తవుతుందని నాగార్జున తెలియజేశారు. ఈ సినిమాలో డా. అక్కినేని నాగేశ్వర రావు, ‘కింగ్’ నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్నారు. విక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ ని అందిస్తున్నాడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారి సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాని నాగార్జున నిర్మిస్తున్నాడు. శ్రియ, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా కొత్త స్క్రీన్ ప్లే తో నిర్మిస్తున్నరని సమాచారం.

తాజా వార్తలు