పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈరోజు జరిగిన ‘థాంక్ యు మీట్’ వేడుకలో సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడూ ఎవ్వరితోనూ అంతతొందరగా కలవని, మాట్లాడని పవన్ ఈరోజు వేడుకలో హృధయాన్ని హత్తుకునేలా సంభాషించాడు.
పవన్ ఈ ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ పై మాట్లాడుతూ “ఈ సినిమాకు సంబంధించి ఇధి పైరసీ కాదని, ఒక కుట్ర అని తెలిపాడు. అంతేకాక ఈ కుట్రలో చాలామంది సినిమాపరిశ్రమకు సంబంధించిన పెద్ధవాళ్ల భాగస్వామ్యం వుందని తెలిపాడు. ఈ సినిమా విజయం సాధించడంతో నేను ఈ విషయాన్ని మర్చిపోతాను అనుకోకండి. నేను ఎవరినీ విడిచిపెట్టను. ఈ కుట్రలో భాగస్వాములకు సరైన శిక్ష పడేలా చేస్తాను” అని తెలిపాడు.
పవన్ పవనిజం గురించి పలికిన పలుకులు అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. “పవనిజం అంటే మీరే. పవనిజం అంటే సమాజంలో మంచి చేయడంకోసం బతకడమే. అభిమానులు నా బలం. మీకోసం నేను ప్రాణాలు ఇవ్వలేనా?? మీరే నా పవర్” అనడంతో అభిమానులు కేరింతలు కొట్టారు.
పవన్ చెప్పిన ఈ వాఖ్యలు గురించి కొన్ని రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ కుట్ర గురించి మీడియాలో పలు ఊహాగానాలు నెలకొన్నాయి. చూద్దాం ఇది ఎక్కడికి దారితీస్తుందో..