మంచి కధ దొరికితే రెమ్యూనరేషన్ గురించి పట్టించుకొను: సమంత

మంచి కధ దొరికితే రెమ్యూనరేషన్ గురించి పట్టించుకొను: సమంత

Published on Oct 13, 2013 3:00 AM IST

Samantha

సమంత ప్రస్తుతం తన కెరీర్ లోనే అద్భుతమైన దశలోవుంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ భామకు ఇటీవలే ‘రామయ్యా వాస్తవయ్యా’ రూపంలో మరో హిట్ వచ్చింది. ఈ సందర్భంగా సమంత మీడియాతో మాట్లాడుతూ “గత యేడాది అనారోగ్యంకారణంగా కొంతకాలం సినిమాలకు దూరం అయ్యాను. కానీ ఈ యేడాది వరుస సినిమాలతో బిజీగా వున్నాను. వచ్చే యేడాది నేను తమిళ సినిమాల మీద దృష్టి సారించబోతున్నాను. దానిమూలంగా తెలుగు సినిమాలకు చిన్న బ్రేక్ వెయ్యవలిసి వస్తుంది”అని తెలిపింది.

అంతేకాక ఈ భామ ఈ యేడాది కొన్ని మలయాళం ప్రాజెక్టులపై కూడా దృష్టిపెట్టనుంది. ‘వాళ్ళు 2 లేక 3 కోట్ల వ్యయంతో సినిమాలు తీసి 15 కోట్ల వరకూ లాభాలను సంపాదిస్తున్నారు. ఈ పోకడ త్వరలో మన తెలుగు సినిమాకు సైతం రానుంది’ అని చెప్పింది. మరి అటువంటి లో బుడ్జెట్ సినిమాలలో మీరు నటిస్తారా అని ప్రశ్నించగా “ఎందుకు చెయ్యను?? నాకు కధ నచ్చితే రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేసి ఆతరువాత లాభాలలో వాటా తీసుకుంటా”అని చెప్పింది.

సొ కాబట్టి ఫ్రెండ్స్ మీలో ఎవరిదగ్గరన్నా మంచి కధవుంది, బుడ్జెట్ లేకపోతే సమంత మీకోసం రెడీగా వుంది. ప్రస్తుతం ఈ భామ ‘మనం’, ఎన్.టి.ఆర్ తో ఒక సినిమా మరియు ‘ఆటొనగర్ సూర్య’ల సినిమాలతో బిజీగా వుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు