పిల్లల కోసం ఓ గొప్ప పనిచేస్తున్న చిన్మయి

పిల్లల కోసం ఓ గొప్ప పనిచేస్తున్న చిన్మయి

Published on Oct 9, 2013 3:25 PM IST

chinmayi

సౌంత్ ఇండియాలో సింగర్ గా చిన్మయికి మంచి పేరుంది. అలాగే ఆమె సమంత కి వాయిస్ ఇస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యింది. చిన్మయి సమంత నటించిన ‘ఏమాయ చేసావే’ సినిమాకి డబ్బింగ్ చెప్పింది. బ్యూటిఫుల్ హీరోయిన్ అయిన సమంతకి ఆమె వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

తాజాగా చిన్మయి ఓ గొప్ప కారణం కోసం ముందుకు వచ్చింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2-8 వరకు ‘జాయ్ అఫ్ గివింగ్ వీక్’ అని సెలబ్రేట్ చేస్తారు. ఈ 7 రోజుల కాలాన్ని ఇండియన్ ఫిలంత్రోఫి వీక్ అంటారు. దీనికోసం చిన్మయి ‘ప్రేమ చినుకులు’ అనే పాటని పాడింది. రాకేందు మౌళి సాహిత్యం అందించిన ఈ పాటని గోపిక్రిష్ణన్ కంపోజ్ చేసారు.

ఈ పాట ఐట్యూన్స్ లో మీకు అందుబాటులో ఉంది. ఈ పాట కోసం మీరు పెట్టిన అమౌంట్ 17000ఎఫ్టి అనే ఫౌండేషన్ కి వెళ్తుంది. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి సంబందించిన ఈ 17000ఎఫ్టి ఫౌండేషన్ లడఖ్ లోని చిన్న పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే లడఖ్ లోని గ్రామీణ ప్రాంతాలను, రూరల్ ఏరియాలోని స్కూల్ లను కొత్త టెక్నాలజీలతో డెవలప్ చేస్తారు.

ఈ ఫౌండేషన్ వారు స్కూల్స్ ని డెవలప్ చేస్తారు, చదువుకునేందుకు మంచి అవకాశాలు కలిపిస్తారు, అలాగే తమ గ్రామాలను మార్చుకోవాలి అనేదాని గురించి చెప్తారు. నిదానంగా గ్రామాల్లో ఉన్న యువ కుటుంబాలను సిటీలకి చేర్చడం. అక్కడ వారిని వాలంటీర్లుగా అక్కడ స్థిరపడేలా జీవనోపాధిని కలిగించడం, చివరిగా వారికి ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని సృష్టిస్తారు.

ఈ గొప్ప కారణం కోసం చిన్మయికి సపోర్ట్ చేయాలనుకున్నవారు ఆమె పాడిన పాటని ఐ ట్యూన్స్ లో డౌన్ లోడ్ చేసుకోవడానికి కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చెయ్యండి.

https://itunes.apple.com/in/album/prema-chinukulu-single/id722415479

ఈపాటని గూగుల్ ప్లే, అమెజాన్ఎంపి3 మొదలైన చోట్ల కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే 17000ఎఫ్టి గురించి తెలుసు కోవాలంటే విజిట్ 17000ft.org

తాజా వార్తలు