విలువల దగ్గర రాజీపడలేను: తమన్నా

విలువల దగ్గర రాజీపడలేను: తమన్నా

Published on Oct 9, 2013 3:45 AM IST

tamannah-bollywood-movie
నాగచైతన్య సరసన నటించిన ‘తడాఖా’ తరువాత తమన్నా మరే సినిమానూ అంగీకరించలేదు. ఆమె ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలలో బిజీగా వుంది. ‘హిమ్మత్ వాలా’ సినిమా పరాజయంపాలైనా అక్కడ జానాలకు ఆమె చేరువయ్యింది

ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సినిమాకు గ్లామర్ ముఖ్యమని నేను నమ్ముతాను. కానీ కధ, కధనాలను పక్కనబెట్టి గ్లామర్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే దాని ఫలితం శూన్యం. బాలీవుడ్ కు వెళ్ళాక నేను బికినీ లో కనిపిస్తానని చాలా మంది చెప్పుకొస్తున్నారు. కానీ నేను ఈ రంగంలోకి రాకముందే కొన్ని పద్ధతులను, నిభంధనలను పెట్టుకుని వాటినే పాటిస్తున్నాను. ఒక సినిమా ఒప్పుకునే ముందు వాటిని ఎప్పటికీ మరువన’ని తెలిపింది

తాజా వార్తలు