ఇటీవలకాలంలో టాలీవుడ్ లో ఘనమైన ఎంట్రీ ఇచ్చిన వారిలో కిచ్చ సుదీప్ ఒకరు. ‘ఈగ’ సినిమాలో ఆటను కనబర్చిన నటనకు ఆంధ్ర ప్రేక్షకుల మన్ననలను పొందాడు. ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి’ లో ఒక ముఖ్య పోషిస్తున్నాడు.
ఆటను టాలీవుడ్ కి కొత్త అయినా కన్నడ లో ప్రముఖ నటుడిగా గుర్తింపువుంది. ఈ పాపులారిటీ తో తన వచ్చే ఎన్నికలలో కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్టు పుకార్లు వచ్చాయి. వాటిని సుదీప్ తనదైన శైలిలో ఖండిస్తూ రాజకీయపార్టీని నిర్వహించడం కన్నా సరదాగా ఒక పార్టీని నిర్వహించడం మంచిదని ఛలోక్తి విసిరాడు