టాప్ 3లో రామయ్యా వస్తావయ్యా ఉంటుంది – దిల్ రాజు

టాప్ 3లో రామయ్యా వస్తావయ్యా ఉంటుంది – దిల్ రాజు

Published on Oct 8, 2013 8:40 PM IST

Ramayya_Vasthavayya
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ అక్టోబర్ 11న భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మూవీలో ఎన్.టి.ఆర్ ని చాలా కొత్తగా చూపించాం ఆని నిర్మాత దిల్ రాజు మరియు డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్తూ వస్తున్నారు. వారు ఎంత కొత్తగా చూపించారో అని చెప్పడానికి సాంపుల్ గా సినిమాలోని మూడు పాటలని ఈ రోజు మీడియా వారికి ప్రసాద్ లాబ్స్ లో వేసి చూపించారు. చూపించిన మూడు సాంగ్స్ కి మీడియా వారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

దిల్ రాజు మాట్లాడుతూ ‘ ఇలా మీడియా వారికి వేసి చూపించాలన్న ఐడియా హరీష్ శంకర్ ఇచ్చాడు. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రిలీజ్ అయిన, ఇక ముందు రిలీజ్ అయ్యే వాటితో కూడా కలుపుకొని చెప్తున్నా ఈ సినిమా ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 3లో నిలిచిపోతుందని’దిల్ రాజు అన్నారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘సినిమా ప్రారంభించిన మొదట్లో దిల్ రాజు గారు మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది మన చేతిలో లేదు, అది ఆడియన్స్ చేతిలో ఉంది. ఎంత బాగా తీస్తున్నాం, ఎంత బడ్జెట్ లో తీస్తున్నాం అనేది మాత్రమే మన చేతిలో ఉంటుంది. కావున హిట్, కలెక్షన్స్ అనే వాటిని వదిలేసి ఎన్.టి.ఆర్ ని ఎలా చూపించాలి అనేదాని మీద దృష్టి పెట్టు అని ఆయన చెప్పారు. అందుకే నేను సినిమా జయాపజయాలను పక్కన పెట్టి ఎన్.టి.ఆర్ ని ఎలా చూపించాలి అనేదాని మీద దృష్టి పెట్టాను. ఫైనల్ గా సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని’ అన్నాడు.

తాజా వార్తలు