చిరన్ ఫోర్ట్ లో జరుగుతున్న బాలకృష్ణ ‘లెజెండ్’ షూటింగ్

చిరన్ ఫోర్ట్ లో జరుగుతున్న బాలకృష్ణ ‘లెజెండ్’ షూటింగ్

Published on Oct 8, 2013 4:00 PM IST

balakrishna

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ చిరన్ ఫోర్ట్ లో జరుగుతోంది. బాలకృష్ణ పవర్ఫుల్ గా మరియు స్టైలిష్ అవతారంలో కనిపించనున్న ఈ సినిమాని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ లు హీరోయిన్స్ గా కనిపించనున్నారు.

14 రీల్స్ బ్యానర్ మరియు వారాహి చలన చిత్ర వారు కలిసి సంయుక్తంగా ‘లెజెండ్’ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ వాడటానికి ఒక స్పెషల్ బైక్ మరియు స్పెషల్ టాటా సఫారీని తయారు చేసారని మేము ఇది వరకే తెలిపాము. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ‘లెజెండ్’ సినిమాని 2014 మొదట్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

తాజా వార్తలు