యువ హీరో నితిన్ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలిసి తెరకెక్కిస్తున్న సినిమా ‘హార్ట్ ఎటాక్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో వున్న మాలగా అనే ఊరిలొ జరుగుతుంది. అందాలుసియా ఆధీనంలో వున్న మాలగా ఈ వూరు బాగా పాపులర్. పురాతన కట్టడాలకు ఈ వూరు ప్రఖ్యాతిగాంచింది
ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకేక్కుతుందని సమాచారం. అధా శర్మ హీరోయిన్. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన చేజ్ సీన్లను, పోరాట సన్నివేశాలను షూట్ చేసారు. ప్రొడక్షన్ టీంతో పాటూ ఫైట్ మాస్టర్లు రామ్ – లక్ష్మణ్ లు కుడా లోకేషన్లకు వెళ్తున్నారు
తన సొంత నిర్మాణసంస్థలో పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్. ఎడిటింగ్ పనులు ఎస్.ఆర్ శేఖర్ చూసుకుంటున్నాడు