మంచు విష్ణు హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. మరి కొద్ది రోజుల్లో విష్ణు నటించిన ‘దూసుకెళ్తా’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది విష్ణు స్లిమ్ అండ్ కండలు తిరిగిన బాడీ గురించే మాట్లాడుకుంటున్నారు.
తన బాడీ లుక్ విషయంలో తనకు వస్తున్న ప్రశంశలు అన్ని కృష్ణ వంశీకి చెందాలని అంటున్నారు. తను అలా స్లిమ్ గా మారడానికి గల విషయాన్ని చెబుతూ ‘ నేను కృష్ణవంశీ గారిని కలిసి నాతో ఓ యాక్షన్ సినిమా చెయ్యమని అడిగాను. అప్పుడు నేను లావుగా ఉండడం చూసిన ఆయన నాతో కామెడీ సినిమా చేస్తానని చెప్పాడు. దాన్ని కాస్త అవమానకరంగా భావించిన నేను మూడు రోజుల్లో జిమ్ కి వెళ్ళడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నా బాడీని ఇలా ఫిట్ గా మార్చుకున్నానని’ చెప్పాడు.
అలాగే తను ఏదో ఆపరేషన్ చేసుకొని సన్నబడ్డాడు అని అంటున్నారని అడిగితే విష్ణు తను ఎలాంటి ఆపరేషన్ చేసుకోలేదని, జిమ్ కి వెళ్లి ఎంతో కష్టపడి తగ్గి ఫిట్ గా తయారయ్యానని చెప్పాడు.