‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ పూనం కౌర్, ఆ సినిమాతో పెద్ద పెద్ద ఆఫర్లు తెచ్చుకోలేకపోయినా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం పూనం కౌర్ కోలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.
ఆమె తాజాగా ఓ ఆసక్తి కరమైన విషయంతో తమిళ ఇండస్ట్రీ మొత్తాన్ని అవాక్ అయ్యేలా చేసింది. పూనం కౌర్ ప్రస్తుతం తమిళంలో ‘రణం’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఒక్క పాత కోసం పూనం కౌర్ 400 కాస్ట్యూమ్స్ ని మార్చింది. ఇప్పటి వరకూ తమిళంలో ఏ హీరో/ హీరోయిన్ ఇలా చేయ్యకపోవడంతో ఇదొక రికార్డ్ అని చెప్పుకుంటున్నారు.