మన టాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలకంటే మాస్ ఎంటర్టైనింగ్ సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. కానీ బాలీవుడ్ లో గతంలో మాస్ మసాలా సినిమాలు తక్కువగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ టాప్ హీరోలందరూ మాస్ మసాలా సినిమాలే చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ కి శ్రీ కారం చుట్టింది కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఆయన వరుసగా తెలుగులో హిట్ అయిన కొన్ని మాస్ మసాల సినిమాలతో అలాగే కొన్ని డైరెక్ట్ మాస్ మసాల సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాడు. దాంతో అందరూ అదే బాట పట్టారు.
‘వాంటెడ్’, ‘రెడీ’, ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’, ‘దబాంగ్ 2’, ‘ఏక్ థా టైగర్’ లాంటి మాస్ ఎంటర్ టైనర్స్ తో వరుస విజయాలు అందుకున్న సల్మాన్ భాయ్ మరి కొద్ది రోజుల్లో అలాంటి సినిమాలకు కాలం చేల్లిపోతుందని జోశ్యం చెబుతున్నాడు. ‘ ఇప్పుడు మాస్ మసాలా సినిమాలు ఎడాపెడా వచ్చేస్తున్నాయి. ఒకే రకమైన విషయాలతో పదే పదే సినిమాలు తీసేస్తున్నారు. దీనివల్ల సృజనాత్మకత తగ్గిపోతుంది అలాగే జనాలకు విసుగొస్తుంది. కావున ఇలాంటి మాస్ మసాల సినిమాకు త్వరలోనే కాలం చెల్లిపోతుందని’ సల్మాన్ భాయ్ అంటున్నాడు.