హైదరాబాద్ రాజదానిగా 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణాకు సంబంధించిన నోట్ ను హోం మినిస్ట్రీ పంపిన నోట్ ను యూనియన్ కేబినేట్ ఆమోదించింది. ఈ వార్త తెలిసిన వెంటనే తెలంగాణా వాసులు సంబరాలలో మునిగితేలిపోయారు. సీమాంధ్రలో మాత్రం నిరసనలు జోరందుకున్నాయి
ఈ రాజకీయ పరిణామాల వలన ఆంధ్రాలో కొన్ని ఏరియాలలో భారీ స్థాయిలో గొడవలు జరగనున్నాయి. దసరా దగ్గరగా వున్న కారణాన ఇప్పుడు ఫిలింనగర్ లో తలెత్తుతున్న ప్రాధమిక ప్రశ్న “మరోసారి తెలుగు సినిమాపై ఈ ప్రాభావం పడనుందా? “. ఎన్.టి.ఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’, విష్ణు నటించిన ‘దూసుకెళ్తా’ సినిమాలు దసరాలో విడుదలకానున్నాయి. మరి ఇప్పుడు నిర్మాతలు వాటిని విడుదల చేస్తారా?? లేక వాయిదా వేస్తారా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిందే??