బాలకృష్ణ కోసం రెడీ అయిన స్పెషల్ టాటా సఫారి

బాలకృష్ణ కోసం రెడీ అయిన స్పెషల్ టాటా సఫారి

Published on Oct 2, 2013 8:15 AM IST

balakrishna
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీని వారాహి చలన చిత్ర వారితో కలిసి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు సినిమా చాలా గ్రాండ్ గా రావడం కోసం ఏ ఒక్క అవకాశాన్ని ఒదులు కోవడం లేదు.

కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో బాలకృష్ణ కోసం ఓ స్పెషల్ బైక్ ని తయారు చేసారని తెలియజేశాం. తాజాగా బాలకృష్ణ ఈ సినిమాలో ఉపయోగించడానికి ఓ టాటా సఫారిని రెడీ చేసారు. ఈ సఫారీ స్పెషల్ గా కనిపించడంకోసం చిన్న చిన్న మార్పులు చేసారు.

జగపతి బాబు నెగటివ్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తాజా వార్తలు